లేజర్ టెక్నాలజీతో తెలుగు సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం భారీ స్థాయిని అందుకుని కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తోంది. ఇలాంటి సినిమాలు కనుక తేడా జరిగితే అటు నిర్మాతకి, ఇటు పరిశ్రమకే కాక సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ ముప్పును తప్పించుకోవడానికి సినిమాను లేజర్ టెక్నాలజీతో రూపొందించడం అన్నివిధాలా శ్రేయస్కరమని ఎ.ఎం.ఎఫ్ అధినేత మామిడాల శ్రీనివాస్ అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ మరింతగా అభివృద్ధిపథంలో పయనించాలన్న కోరికతో ఎబిలిటీ మీడియా ఫ్యాక్టరీ (ఎ.ఎం.ఎఫ్), యునైటెడ్ మీడియా వర్క్స్ (యుఎండబ్ల్యు) సంస్థలు సంయుక్తంగా లేజర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం పరిశ్రమలో అడుగిడుతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో లేజర్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. ఈ క్లిప్పింగ్‌లన్నీ లేజర్ టెక్నాలజీ ద్వారా ప్రదర్శించడం విశేషం. ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మరికొంత సమాచారం తెలియజేస్తూ- తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో లేజర్ టెక్నాలజీతో సినిమాలను ప్రదర్శించడానికి శ్రీకారం చుట్టామని, లాభాపేక్ష అంతగా లేకుండా ఈ టెక్నాలజీని పరిశ్రమకు, ప్రేక్షకులకు చేరువ చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఎల్‌సిడి టెక్నాలజీ కూడా ప్రస్తుతం మార్కెట్‌లోవున్న ధరలతో పోల్చుకుంటే తక్కువ ధరకే అందించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ విధానంతో సినీ ఎగ్జిబిటర్లకే కాకుండా నిర్మాతలకు కూడా లాభదాయకం అవుతుందని ఆయన తెలిపారు. లేజర్ టెక్నాలజీతో 60 నుండి 70 శాతం ఖర్చు తగ్గుతుందని, దీనివల్ల నిర్మాతకు మరింత లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. అధిక నాణ్యతగల టెక్నాలజీ కొన్ని సంస్థలు అందిస్తున్నాయని, అందులో భాగంగా తాము లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొని పలు ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకొన్నారు. వి.ఎల్.మల్లికార్జున్‌గౌడ్, అముల్ గాడ్గె, సంగిశెట్టి దశరథ తదితరులు పాల్గొన్నారు.