డబ్బింగ్‌కు సై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 November 2015
వరుస విజయాలతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేసులో నిలిచింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. గోపీచంద్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటిస్తున్న ఈ భామకు తన సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని తెగ ఆశపడుతోంది. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటిస్తోన్న రకుల్ ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెబుతోందని అంటున్నారు. దీనికోసం ఆమె తెలుగుకూడా బాగానే నేర్చుకుంటోంది. మరి డబ్బింగ్‌లో అనుకున్న విధంగా సెట్ అయితే ఇకపై తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు సొంత డబ్బింగే చెప్పడం ఖాయం. ప్రస్తుతం స్పెయిన్ షూటింగ్‌లో పాల్గొన్న రకుల్ మరోవైపు అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తోంది.