రియలిస్టిక్‌గా దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్యం’ ఘన విజయం సాధించి శత దినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’ 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ‘40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. బెంగళూరు, బెల్గామ్‌లో షూటింగ్ జరిగింది. ఈ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం.’ అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ,‘బెంగుళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జూన్, జూలై నెలల్లో పూర్తిచేసి సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.