తుహిరే మేరీజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలింమేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీజాన్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ, ‘ఇదొక ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌చేస్తున్నాం’ అని చెప్పారు. హీరో వికాష్ మాట్లాడుతూ,‘తెలుగులో ఇది నా మొదటి సినిమా. అందరూ కొత్తవాళ్ళతో కలిసిచేశాం. మంచి పాటలు కుదిరాయి. సినిమాను కొత్తగా తీయడానికి ప్రయత్నించాం. హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు.
హీరోయిన్ కళ్యాణి మాట్లాడుతూ,‘ఈ సినిమాలో స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు కలగలిపి ఉంటాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాను’ అన్నారు. రచయిత చాణక్య మాట్లాడుతూ, ‘ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దాం. ఆరు పాటలు రాశాను. జోడా శాండీ మంచి మ్యూజిక్ ఇచ్చారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జోడా శాండీ, కొరియోగ్రఫీ: కెవిన్, బాబి ఏంటోనీ, ఎడిటింగ్: రాజు లీల, పాటలు: చాణక్య, నిర్మాత: కనవరెడ్డి నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్‌కుమార్.