రజనీతో లారెన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా భారీ హైప్‌తో వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు రజనీ. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు రజనీ. తాజాగా ఆయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్‌గా ఇమేజ్ తెచ్చుకుని, తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారి, కాంచన, ముని, స్టైల్ వంటి చిత్రాల విజయంతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రజనీ నటించనున్నాడు. లారెన్స్ రజనీకి వీరాభిమాని కావడంతో ఆయనతో సినిమా చేయడానికి కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రజనీకి కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ కథ వినగానే రజనీకాంత్ వెంటనే ఓకే చెప్పాడని, త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళుతుందని తెలిసింది.