తిరుపతిలో శాతకర్ణి పాటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ట్రేడ్ వర్గాలతోపాటు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈచిత్రంలోని పాటలను తిరుపతిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల కానుంది. అదే నెల 16న పాటలను విడుదల చేస్తారట. బాలకృష్ణ కెరీర్‌లో వందో చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. చింతన్ భట్ సంగీతం అందిస్తున్న పాటలను తిరుపతిలో విడుదల చేస్తే సెంటిమెంట్‌గా బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. అందాల భామ శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కనుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.