అలరించిన మంజిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై మల్లు భామలు సత్తా చాటడం ఇవాళ కొత్తేంకాదు. ఇప్పటికే పలువురు తారలు ఇక్కడ క్రేజ్ తెచ్చుకుని దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా మలయాళ భామల అందాలకు తెలుగు ప్రేక్షకుడు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్, నయనతార, అనుపమా పరమేశ్వరన్, నమితా ప్రమోద్ వంటివాళ్లు మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా అదే కోవలో ఫామ్‌లోకొచ్చింది మంజిమా మోహన్. నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించిన ఈ భామకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో మంజిమ గ్లామర్ నటనతో ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది మంజిమ. ఈ సినిమా తరువాత ఖచ్చితంగా ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అంటున్నాయి సినీ వర్గాలు.