శరవేగంగా శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు రూపొందిస్తున్న చిత్రం శతమానం భవతి. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అమలాపురంలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ టాకీపార్టు ఈ 18కి పూర్తిచేస్తామని, ఈనెల 28న పాటలతో సహా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. తాతామనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపిస్తూ ఓ అందమైన కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందిస్తున్నామని, జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ప్రకాష్‌రాజ్, జయసుధ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీజె. మేయర్, నిర్మాతలు: రాజు, శిరీష్, దర్శకత్వం: వేగేశ్న సతీష్.