24న ఎంతవరకు ఈ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ అగర్వాల్ ప్రధాన తారాగణంగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై తెలుగులో అందిస్తున్న చిత్రం ఎంతవరకు ఈ ప్రేమ. డి.వెంకటేష్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి డి.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఔట్ అండ్ ఔట్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా రూపొందిందని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, కాజల్ అగర్వాల్ గ్లామర్, నటన ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని ఆయన తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 24న థియేటర్లకు వస్తున్నామని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని, తమ సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆయన అన్నారు. బాబిసింహ, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, కెమెరా: అభినందన్, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డి.కె.