అంజలి పాటతో చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రలో కామెడీ థ్రిల్లర్‌గా శ్రీ విఘ్నేష్, కార్తీక్ సినిమా, క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం చిత్రాంగద. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని, హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఉత్కంఠ భరితంగా, ఆసక్తికరంగా ఉండేలా దర్శకుడు అశోక్ రూపొందించారని తెలిపారు. సినిమాలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని, ముఖ్యంగా అంజలి పాడిన పాట సినిమాకు హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. విభిన్నమైన పాత్రలో చిత్రాంగద ఉంటుందని, ఆమె అభినయమే సినిమాకు హైలెట్‌గా ఉంటుందని అన్నారు. కొన్ని అదృశ్యశక్తుల కారణంగా చిత్రాంగద జీవితం ఎలాంటి చిక్కుల్లో పడింది? ఆమెకెదురైన సవాళ్లను ఎలా అధిగమించింది? అన్నదే ఈ సినిమా కథనమని, లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అమెరికాలోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని తెలిపారు. ఈనెలాఖరుకు ఆడియోను, వచ్చేనెల మొదటివారంలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. జె.పి, సప్తగిరి, రాజారవీంద్ర, సింధుతులానీ, రక్ష, దీపక్, సాక్షిగులాటి, సుధీర్, జ్యోతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కెమెరా: బాల్‌రెడ్డి, జేమ్స్‌క్వాన్, రోహిన్, నిర్మాతలు: గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ జి.