‘నోట్ల’రద్దుకు బాలీవుడ్ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై విపక్ష పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లధనం వెలికితీత నెపంతో పెద్దనోట్లను హఠాత్తుగా రద్దు చేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు నరకం చవిచూస్తున్నారని దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సహా కొందరు విపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేయడాన్ని బాలీవుడ్ నటులు తప్పుపడుతున్నారు. దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ హర్షం ప్రకటించారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద జనం బారులుతీరి అవస్థలు పడుతున్నందున ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ‘ట్విట్టర్’లో తీవ్రంగా స్పందించారు. ‘కేజ్రీవాల్ ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారా?’ అని రిషి ట్వీట్ చేశారు.
సామాన్యులకు ఇబ్బందే..
పెద్దనోట్లను చెలామణి నుంచి ఉపసంహరించడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమని, అయితే ఇదే సమయంలో పేదప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని తమిళ నటుడు విజయ్ అన్నారు. పెద్దనోట్లను రద్దు చేశాక సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనందున దేశ జనాభాలో 80 శాతం మంది ప్రజలు చేతిలో డబ్బుల్లేక నానాపాట్లు పడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రధాని నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే.. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు అనివార్యం.. దేశ ఆర్థిక ప్రగతి ఆశాజనకంగా ఉండేందుకు మంచి నిర్ణయం తీసుకున్నా, నిత్యావసర సరకులు కొనుక్కోలేక సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..’ అని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రజలు, వృద్ధులకు అండగా నిలిచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.