మాస్ సినిమాలకు చైతూ పనికొస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమమోహన్ జంటగా గౌతమ్‌వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథాచిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో ఇంటర్వ్యూ...
రెస్పాన్స్ ఎలా ఉంది?
- చాలా బాగుంది. తెలుగు వర్షన్‌తోపాటు తమిళ వర్షన్‌కు (అచ్చమ్‌ఎన్బదు మదమైదా- శింబు హీరో) కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. యంగ్ స్టర్స్ అంతా రొమాన్స్, యాక్షన్‌ను మిక్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిలీజ్‌కి ఇంత లేట్ అయినా అందరూ ఆ విషయాన్ని పక్కనబెట్టేసి సినిమా చూస్తున్నారు. సో, అందరం హ్యాపీ.
రిలీజ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి?
- తెలుగు రిలీజ్‌కు ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. తెలుగులో ఎప్పుడో ఫస్ట్ కాపీతో సహా అంతా రెడీ అయిపోయింది. తమిళ వర్షన్ కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈమధ్యలో చైతూ కూడా ‘ప్రేమమ్’ మొదలుపెట్టడం, అది రిలీజవ్వడం జరిగిపోయాయి. ఇంత లేట్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాకోసం ఎదురుచూడడం మాత్రం మర్చిపోలేనిది.
కరెన్సీ బ్యాన్ రిస్క్ అనిపించలేదా?
- కరెన్సీ బ్యాన్‌ను తప్పుపట్టడానికి లేదు. నల్లధనాన్ని తరిమేయాలని ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే! అయితే మేము ముందే మా సినిమా విడుదల తేదీని ప్రకటించేశాం. అప్పటికే అన్నీ సిద్ధమయ్యాయి. మళ్ళీ వాయిదా వేయడమంటే బాగుండదనే చెప్పిన తేదీకే వచ్చేశాం. కరెన్సీ బ్యాన్‌వల్ల 30% కలెక్షన్స్ తగ్గినా, మరో మూడు వారాలు సినిమా థియేటర్లలోనే ఉంటుంది కాబట్టి మున్ముందు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయన్న నమ్మకం ఉంది.

‘ ఏమాయ చేశావే తరహా’లో ఫస్ట్ఫా నడిపి,
సెకండాఫ్ యాక్షన్ వైపు వెళ్ళారెందుకని?
- ఇది పూర్తిగా ఒక క్యారెక్టర్ డ్రివెస్ స్టోరీ. ఒక కథగా కాకుండా, హీరో పాత్ర ఎటు వెళ్తే సినిమా అలా సాగుతుంది. ఇలాంటి కథలో ఎన్ని జానర్లైనా ఉండొచ్చన్నది నా అభిప్రాయం. నాక్కూడా రెండు, మూడు జానర్స్ మిక్స్‌చేసి ప్రయోగం చేయడం చాలా ఇష్టం. అది ఈ సినిమాతో నెరవేరింది. సెకండాఫ్‌కి ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా కథే మారిపోవడం కొందరికి బాగా నచ్చింది. ఇంకొందరు అస్సలు బాలేదు అన్నారు. ఏదేమైనా సినిమాపైన డిస్కషన్ జరగాలి.
నాగచైతన్యలో వచ్చిన మార్పు?
- వ్యక్తిగా చైతు అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నాడు. సరదాగా తమ్ముడిలా ఉంటాడు. అతడ్ని డైరెక్ట్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ తెలుగు వర్షన్ రిలీజ్‌కు రెడీ అయినా కూడా తమిళ వర్షన్ కోసం లేట్ అవుతున్నా ఓపికగా ఉన్నాడు. ఇక హీరోగా అయితే చైతన్య స్థాయి పెరిగింది. సాహసం శ్వాసగా షూట్ అప్పుడు అంటూ ఉండేవాడిని, ‘‘ఈ సినిమాతో నువ్వు మాస్ సినిమాలు కూడా చేయొచ్చు’’ అని. ఇప్పుడు నిజంగానే మాస్ హీరో అవ్వగలిగే లుక్, స్టేటస్ తెచ్చుకున్నాడు. నేనైతే అతడితో ఇంకో సినిమా చేయడానికైనా రెడీ, చైతూకి ఆ ఫీలింగ్ ఉందో లేదో మరి.
క్లైమాక్స్‌పై విమర్శలకు మీరేమంటారు?
- ముందే చెప్పినట్టు ఏ సినిమాకైని డిస్కషన్ ఉండాలి. అంతవరకూ రియలిస్టిక్‌గా, కాస్త డార్క్‌గా ఉన్న సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా కమర్షియల్ టచ్‌తో ఎండ్ చేశా. ఇది నేను కావాలని తీసుకున్న నిర్ణయమే! గౌతమ్ మీనన్ మాస్ సినిమా తీస్తే ఇలా ఉంటుందని, చివర్లో ఇచ్చిన టచ్ అన్నమాట. నిజం చెప్పాలంటే క్లైమాక్స్‌లో వచ్చే సబ్ ప్లాట్‌ని డైలాగ్స్‌ద్వారా కాకుండా, మాంటేజ్ సీన్లతో చూపాలనుకున్నా. అవి స్క్రిప్ట్‌లో కూడా ఉన్నాయి. కొన్ని అనుకోని కారణాలవల్ల అది షూట్ చేయడం కుదర్లేదు. అయినప్పటికీ చాలామంది ఈ క్లైమాక్స్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
ద్విభాషా చిత్రాలను తీయడం మానేస్తారా?
- అది ద్విభాషా చిత్రం అవ్వడంవల్లనే వచ్చిన సమస్య అని చెప్పలేం. కొన్నిసార్లు పరిస్థితులు అలా మారిపోతాయి. నేనైతే ఏ సినిమా అనుకున్నా మొదట రెండు భాషల్లోనూ ఆ సినిమా చేయాలనే ఎక్కువగా ఆచిస్తూంటా. నా మేకింగ్ స్టైల్ కూడా ఎవ్వరికీ ఇబ్బంది పెట్టేదిగా ఉండదు కాబట్టి ద్విభాషా చిత్రంతో సమస్యేం లేదు.

-యు