సింగం-3కు 50 లక్షల వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, అనుష్క, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం సింగం-3. సింగం సిరీస్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోందని నిర్మాత శివకుమార్ తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లోనే ఐదు మిలియన్ల క్లిక్స్ సాధించి, అంచనాలు పెరిగేలా చేశారని, ప్రేక్షకులు ఈ సినిమాకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. మోషన్ పోస్టర్‌కు, ఫస్ట్‌లుక్‌కు భారీ స్పందన లభించిందని, అంచనాలను మించే విధంగా ఈ సినిమా రూపొందిందని అన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ సినిమా మొదటినుండి చివరి వరకు ఆసక్తికరమైన థ్రిల్స్‌తో ఉంటుందని, నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి తన వృత్తి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని ఆయన అన్నారు. సూర్య నటన, పాత్ర చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని, ఈనెలాఖరున ఆడియోను విడుదల చేసి, డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. రాధికాశరత్‌కుమార్, నాజర్, రాడాన్వ్రి, సుమిత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, దర్శకత్వం: హరి.