‘బ్లాక్ అండ్ వైట్’కు ఎన్‌హెచ్‌ఆర్‌సి అవార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసుల వేధింపులు, మహిళలపై అరాచకాలు, పౌరహక్కులకు భంగం కలిగించే అంశాలపై హృదయాన్ని కలచివేసే దృశ్యాలతో తెరకెక్కిన ‘బ్లాక్ అండ్ వైట్’ సైలంట్ షార్ట్ ఫిల్మ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అత్యున్నత అవార్డుకు ఎంపికైంది. కేరళకు చెందిన అనుజ్ ఎస్.ఆర్ దీనిని రూపొందించారు. జాతీయ మానవహక్కుల సంఘం లఘుచిత్రాల పథకం కింద దీనిని ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన చిత్రాలకు లక్ష రూపాయల నగదు బహుమతిగా అందజేస్తారు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎంపిక కమిటీ ప్రకటించింది. అలాగే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన రిమ్‌బిక్ దాస్ రూపొందించిన ‘టుమ్లింగ్ స్ట్రీట్’, సోమనాథ్ చక్రవర్తి రూపొందించిన ‘అంబ్రోసియ’ లఘు చిత్రాలకు వరుసగా ద్వితీయ, తృతీయ ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లుగా ఎంపికైనాయి. వాటికి 75 వేలు, 50 వేల రూపాయల చొప్పున బహుమతి అందజేస్తారు. కేవలం సన్నివేశాలు, దృశ్యాలే కథను చెబుతాయి. శబ్దం, డైలాగ్స్ లేకుండా కొనసాగడం ఈ చిత్రాల్లో విశేషం. డిసెంబర్ 10న జరిగే మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను బహూకరిస్తారు. ఇంగ్లీష్, హింది, కన్నడ, తెలుగు, మరాఠి, బెంగాలీ, తమిళ్, అస్సామీ భాషలకు చెందిన 84 ఎంట్రీలు రాగా ఈ మూడింటికి బహుమతులు దక్కాయి.