పవన్ మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత సుధాకర్‌రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్‌మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణచైతన్య దర్శకుడు. తొలిసారి పవన్‌కళ్యాణ్ తాను కాకుండా తన బ్యానర్‌పై మరో హీరో నితిన్ కోసం నిర్మాతగా మారడం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మాణ బాధ్యతలతోపాటు మూల కథను సమకూర్చడం మరో హైలెట్.
ఇంతటి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు పవన్‌కళ్యాణ్ క్లాప్‌నివ్వగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరోయిన్, నటీనటులు, పూర్తి టెక్నికల్ టీమ్ మరియు షూటింగ్ సంబంధిత వివరాలను త్వరలోనే తెలియజేస్తారు. ఈ చిత్రానికి మూల కథ:త్రివిక్రమ్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫి:ఎన్.నటరాజ సుబ్రహ్మణ్యన్, ఆర్ట్:రామకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కృష్ణచైతన్య.