మిత్రమా.. కుశలమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ చాలా రోజుల తరువాత కలిసి ముచ్చటించుకున్నారు. ఈ ఇద్దరి హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని కలహించుకుంటుంటే, వీరిద్దరూ మాత్రం నింపాదిగా తమ ఆరోగ్య విషయాల గురించి చర్చించుకొని సంతోషపడ్డారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో కమల్ ఆఫీసుకు రజనీకాంత్ వెళ్లి ఆయన్ని కలిశారు. కమల్‌హాసన్ కాలికి అయిన గాయం గురించి రజనీకాంత్ అడిగి తెలుసుకున్నారు. కమల్‌హాసన్ కూడా రజనీకాంత్ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరితోపాటు కమల్ నటించిన ‘చీకటిరాజ్యం’ చిత్ర దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ కూడా వున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమల్‌హాసన్‌లతో కలిసి ఫొటో దిగిన సెల్వ, తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇద్దరు సూపర్‌స్టార్‌లతో కలిసి ఫొటో తీసుకోగలగడం తన జీవితంలో అద్భుతమైన క్షణాలు అని ఆయన వ్యాఖ్యానించారు.