8న కవ్వింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌దాట్లా, దీక్షాపంత్ జంటగా త్రిపురనేని విజయ్‌చౌదరి దర్శకత్వంలో అంజనీమూవీస్ పతాకంపై పువ్వల శ్రీనివాసరావు రూపొందించిన ‘కవ్వింత’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌చౌదరి మాట్లాడుతూ దొంగనోట్లను ఎలా మోసంతో ప్రజలలోకి పంపిస్తున్నారో తెలుపుతూ ఓ అందమైన గ్రామంలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, కెమెరా పనితనం, సంగీతం హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. 5 పాటలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, 8న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 70 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, కొత్త ప్రయోగం చేయాలనే తపనతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారని, కథాకథనాలు సరికొత్తగా ఉంటూ అన్ని ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటాయని నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, పాటలు: చైతన్యవర్మ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: మధు జి, నిర్మాత: పువ్వల శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌చౌదరి త్రిపురనేని.