కేరళలో నీలిమలై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్‌కృష్ణ, స్వరూప జంటగా బేబి హర్షిత ప్రధాన పాత్రలో నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ, కేరళలోని వివిధ లొకేషన్లలో 70 శాతం చిత్రాన్ని పూర్తిచేశామని, మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుతున్నామని తెలిపారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిస్తామని, ఇదే నెలలోనే ఆడియోను విడుదల చేసి డిసెంబర్ మొదటివారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. చిత్రంలోని ఆరు పాటలకు మంచి సంగీతం కుదిరిందని, అయ్యప్ప భక్తులకు నచ్చే విధంగా పాటలన్నీ తీర్చిదిద్దామని, ఓ అందమైన కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జతచేసి రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, తప్పక విజయవంతం అవుతుందని దర్శకుడు సూర్యకిరణ్ తెలిపారు. సాయికిరణ్, అలి, భానుచందర్, సత్యప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, నిర్మాత:ఆనంద్‌కృష్ణ, మాటలు:రామచంద్రారెడ్డి, కెమెరా:కిరణ్ కుమార్ కొండా, సంగీతం:సదివె దేవేంద్ర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సూర్యకిరణ్ ఇలాది.