హీరోయిన్‌గా గీతా మాధురి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల్లో స్టార్లు గాయకులవడం మనం చూస్తున్నదే. ఇప్పుడు సింగర్ హీరోయిన్‌గా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. టాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న గీతా మాధురి హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇంతకుముందు షార్ట్ ఫిలింస్‌లో నటించిన అనుభవమున్న గీతామాధురి, ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె రోల్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తిచేసిందని సమాచారం. అందం, టాలెంట్ రెండూ వున్న గీతామాధురి సడెన్‌గా హీరోయిన్‌గా మారడం అందరిలో ఆసక్తి నెలకొల్పింది. అయితే, ఈమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మరి ఈ సినిమా తరువాత గీతా మాధురి హీరోయిన్‌గానే సెటిల్ అవుతుందా లేక సింగర్‌గా కూడా వుంటుందో చూడాలి.