శ్రీరాఘవకు చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ ఏస్థాయితో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులోనూ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆయన నటించిన ‘సింగం-3’ వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే సూర్య అప్పుడే రెండు కొత్త సినిలను మొదలుపెట్టేశాడు.
అందులో ఒకటి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తానా సెరింధా కూట్టమ్’ కాగా, రెండోది సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. సెల్వరాఘవన్ సినిమాను సూర్య ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2013లో విడుదలై ‘వర్ణ’ సినిమా తరువాత సెల్వరాఘవన్ కనిపించకుండా పోయారు. ఆయన దర్శకత్వంలో ఈమధ్యే మొదలైన ఒక సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతానికి రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓ సినిమా మాత్రమే చేస్తున్నారాయన. అలాంటి సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య సినిమా అనౌన్స్ చేస్తారని ఎవ్వరూ ఊహించనిది. ఈ అనౌన్స్‌మెంట్‌తో సూర్య అభిమానులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఇక సూర్యతో సినిమా చేయాలని ఇటు తెలుగుతోపాటు తమిళంలోనూ స్టార్ డైరెక్టర్స్ అంతా వెంటపడుతూ ఉంటే సూర్య మాత్రం అనూహ్యంగా కొత్త దర్శకులను, హిట్స్‌లేని దర్శకులను ఎంపిక చేసుకుంటూ ట్విస్ట్ ఇస్తున్నారు.