నితిన్‌తో కొత్త హీరోయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్‌ల సంయుక్త నిర్మాణంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించిన యంగ్ హీరో నితిన్, ఈమధ్య దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా వైవిధ్యమైన రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఉండబోతోంది. తన సినిమాల్లో ప్రేమకథలకు, అందులోని ప్రేమికులకు పరీక్ష పెట్టే దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాలో నితిన్ కోసం ఒక కొత్త హీరోయిన్‌ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక కొత్త నటిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. హను గత సినిమాలలో ‘అందాల రాక్షసి’తో లావణ్య త్రిపాఠిని, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో మెహ్రీన్ కౌర్ వంటి టాలెంటెడ్ హీరోయిన్లను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మేఘ అక్ష అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నాడు. ఇకపోతే 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 90 శాతం వరకూ ఫారిన్ లొకేషన్‌లో షూటింగ్ జరుపుకుంటుందట. ఈ షూటింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో మొదలై 2017 వేసవికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర టీమ్.