వెండితెరకు పండుగొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గోవాలో నేటినుంచి ఇఫి-2016
* 90 దేశాల ప్రతినిధుల రాక
* 300 సినిమాల మధ్య పోటీ
* ఇండియన్ పనోరమాలో 22 సినిమాలు
* నేపథ్య గాయకుడు బాలూకు సెంటినరీ అవార్డు

ఆసియాలో అతి పురాతనమైన, భారత్‌లో అతిపెద్దదైన సినిమా పండుగకు గోవా ముస్తాబైంది. ఆదివారం ప్రారంభమయ్యే భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎనిమిది రోజులపాటు కనువిందు చేయనుంది. ఆస్కార్ బరిలో నిలిచిన, కేన్స్‌లో ప్రదర్శించిన అనేక చిత్రాలు ‘ఇఫీ’ బరిలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సినిమారంగంలో భారత్‌కు ఉన్న విశిష్ట స్థానం దృష్ట్యా ‘ఇఫీ’ వేడుకకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. సినిమా మాధ్యమంలో ప్రజలకు ఏ విషయాన్నైనా సులువుగా తెలియచెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు చలనచిత్రాలను రూపొందిస్తున్నాయి. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, మానవ జీవితంలో ఉన్న అనేక వైరుధ్యాలను చర్చించడానికి సమాంతర సినిమాగా ఇలా రకరకాలుగా సినిమా తన శాఖలను విస్తరించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ సినిమాలను ఎన్నిక చేసి, ప్రపంచవ్యాప్తంగా వాటికి గౌరవాన్ని ఇచ్చే బృహత్ కార్యక్రమాన్ని ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి. అన్ని దేశాల్లో జరుగుతున్న ఈ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో అనేక మంది తమ ఉత్తమ చిత్రాలను ప్రదర్శించి, సినిమా గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.
1952 నుంచి ‘ఇఫి’ నిర్వహిస్తున్నారు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వేదికలపై ఈ వేడుకలను నిర్వహించారు. అయితే 2004 నుంచి గోవా స్థిర వేదికగా మారింది. ఇప్పుడు నిర్వహిస్తున్న 47వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు కూడా గోవాయే వేదికగా నిలిచింది. నేటి నుంచి ప్రారంభవౌతున్న ఈ ఉత్సవం ఈనెల 28 వరకు సాగనుంది. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా అనేక చిత్రాలు పోటీలో పాల్గొంటున్నాయి. 90 దేశాల నుండి దాదాపుగా 300 సినిమాలను ఎంపిక చేశారు. ఈ ఫెస్టివల్స్‌లో వివిధ విభాగాలలో చిత్రాలను ప్రదర్శించి, ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో విజేతలను నిర్ణయిస్తారు. ఇండియన్ పనోరమా విభాగంలో ఫీచర్ ఫిలిమ్స్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్, స్పెషల్ ఇండియన్ ప్యాకేజెస్ లాంటి పలు విభాగాలలో చిత్రాలను ప్రదర్శిస్తారు. డాక్యుమెంటరీలు కూడా ప్రేక్షకుల కోరిక మేరకు ప్రదర్శిస్తున్నారు. గోవాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ స్టేడియం, 47వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు వేదికగా మారింది. గోవాలోని ఐనోక్స్ థియేటర్లు, కాలా అకాడెమీ, మకేంజ్ ప్లేస్, ఆజాద్ మైదాన్‌లలో కాక ఓపెన్ ఎయిర్ స్క్రీన్స్‌లో కూడా ప్రదర్శించనున్నారు. సినిమాలతోపాటుగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రేక్షకులకోసం సమర్పిస్తున్నారు. ఫెస్టివల్‌లో భాగంగా వర్క్‌షాపులు, మాస్టర్ క్లాసిక్స్‌పై చర్చలు జరగనున్నాయి. ఇండియన్ పనోరమా విభాగంలో 22 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇందులో ‘ఇష్టీ’ అనే సంస్కృత చిత్రాన్ని మొదటి సినిమాగా ప్రదర్శిస్తారు. వాటితోపాటుగా ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఓపెన్ ఫిలిమ్‌గా పోలండ్‌కు చెందిన ‘ఆఫ్టర్ ఇమేజ్’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ముగింపు చిత్రంగా దక్షిణ కొరియాకు చెందిన ‘ది ఏజ్ ఆఫ్ షాడోస్’ చలనచిత్రాన్ని స్క్రీనింగ్ చేయనున్నారు. మిడ్ ఫిలిమ్‌గా స్పానిష్ నుండి వచ్చిన ‘టమారా’ను ప్రదర్శిస్తారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో పాల్గొననున్న చిత్రాలన్నీ స్క్రీనింగ్ చేసి, ఎంపిక చేసినవే.
ఈసారి ఫిలిమ్ ఫెస్టివల్‌లో సెంటినరీ అవార్డు ఆఫ్ ఇండియన్ ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా దక్షిణాది గాంధర్వ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎంపికవ్వడం విశేషం. ఈ చిత్రోత్సవంలో బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ (మేల్ అండ్ ఫిమేల్), స్పెషల్ జ్యూరీ అవార్డు, సెంటినరీ అవార్డ్ ఆఫ్ బెస్ట్ డెబట్ డైరెక్టర్ లాంటి పలు విభాగాలలో విజేతలను ప్రకటించనున్నారు. 47వ ఇఫీ వేడుకలకు గోవా వేదిక కాగా ఫెస్టివల్ డైరెక్టర్‌గా సెంథిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు వెంకయ్యనాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం రమేష్ సిప్పీ సమక్షంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రోత్సవం జ్యూరీలో తెలుగు దర్శకుడు సి.వి.రెడ్డి సభ్యుడిగా ఉండటం విశేషం. కాగా ‘బాహుబలి’ చిత్రాన్ని ఈ వేడుకలలో ప్రదర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి, సినిమా ప్రియులకు మంచి చిత్రాలను అందిస్తున్న ఫిలిమ్ ఫెస్టివల్స్‌కు అన్ని దేశాలనుండి అతిథులు విచ్చేశారు. నేటి నుండి జరగనున్న ఈ సినిమా పండుగ మంచి చిత్రాలను ఎంపిక చేసి, ఉత్తమ అభిరుచిగల ప్రేక్షకులకు అందిస్తుందని ఆశిద్దాం.

chitram...
ఇండియన్ పనోరమ విభాగంలో
ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైన ‘బాహుబలి’

* నేపథ్య గాయకుడు బాలూకు సెంటినరీ అవార్డు

‘ఇఫి’లో ప్రదర్శించే తొలి చిత్రం..‘ఆఫ్టర్ ఇమేజ్’ (పోలండ్)లో ఓ సన్నివేశం

-యు