నా లెక్కే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న హాట్ భామ తమన్నా..
మంచి జోరుమీదుంది. ఓవైపు హీరోయిన్‌గా క్రేజీ స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే మరోవైపు.. సెలెక్టివ్‌గా ఐటెం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం
తమిళంలో విశాల్ సరసన ‘కత్తిసందై’ (తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’),
తెలుగులో ‘బాహుబలి-2’ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా, మరోవైపు
బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్టుగా ఈ భామకు
అవార్డ్స్ అంటే పెద్దగా లెక్కే లేదని చెబుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను అవార్డుల పట్ల అభిప్రాయం ఏమిటి అని అడిగితే విచిత్రమైన సమాధానం చెప్పింది. ‘అవార్డులంటే నేను లెక్కచేయను, అవార్డుకోసం సినిమా హిట్ అవ్వాలని అనుకోను, అలాగని ప్లాప్ సినిమాకు అవార్డు వస్తే అందులో ఎలాంటి కిక్ ఉండదు’ అని అంది. కేవలం గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం
వున్న పాత్రలు కూడా చేయాలని ఉందని అంటోంది!