పవన్‌కు జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ త్రిష... ఈమధ్య సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి కానె్సప్టు ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ‘మోహిని’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ సాధురంగా వెట్టై సినిమాలో నటిస్తుంది. ఇక లేటెస్ట్‌గా త్రిషకు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఇదేమిటో తెలుసా. పవన్‌కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట!! ఇప్పటికే ఈ అమ్మడు ‘తీన్మార్’ సినిమాలో పవన్‌తో కలిసి నటించింది.. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌కాలేదు కానీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కవుట్ అయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ త్రిషను హీరోయిన్‌గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న పవన్‌కళ్యాణ్.. ఈ సినిమా తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు నయనతారను అనుకున్నారు. కానీ పవన్ నయనతారతో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి త్రిష వచ్చి చేరింది. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మళ్ళీ పవన్‌తో నటిస్తున్న త్రిషకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి!