సంజీవని టీజర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నివాస్ క్రియేషన్స్ పతాకంపై అనురాగ్, తనూజ, మనోజ్, మోహన్ ప్రధాన తారాగణంగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ రూపొందించిన చిత్రం ‘సంజీవని’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కందుకూరి మాట్లాడుతూ హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రం అందరికీ నచ్చేలా రూపొందిందన్నారు. ఈ సినిమాను మొదలుపెట్టి సంవత్సరంన్నర అయిందని, అసలు ఇటువంటి కథను సినిమాగా చేయగలమా అన్న అనుమానాలు మొదట్లో అనేకమంది వ్యక్తం చేశారని, ఆరు నెలల సమయం ట్రైలర్ షూట్‌కు, గ్రాఫిక్స్ కార్యక్రమాలకు, స్టోరీ డిజైన్‌కు పట్టిందని, పోయిన సంవత్సరం మార్చి 1న షూటింగ్ మొదలుపెట్టి 66 రోజుల్లో పూర్తిచేశామని తెలిపారు. అనేక వైవిధ్యమైన లొకేషన్లలో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో పాటలు హైలెట్‌గా ఉంటాయని ఆయన అన్నారు. మంచి ప్రతిభ ఉన్నవారందరూ ఈ సినిమాకోసం కష్టపడ్డారని, ప్రేక్షకులు తప్పక ఈ చిత్రం చూసి ఆనందిస్తారని నిర్మాత నివాస్ అన్నారు. కార్యక్రమంలో అనురాగ్, సంగీత దర్శకుడు శ్రవణ్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: సుజీత్ పాలడుగు, నిర్మాత: జి.నివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: రవి వీడే.