యూరప్ నుంచి ఖైదీ వచ్చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిజెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్, ఎ.సుభస్‌కరన్ రూపొందిస్తున్న చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను యూరప్‌లో పూర్తిచేశారు. చిత్ర యూనిట్ తిరిగి భారతదేశానికి వచ్చింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మంచి లొకేషన్లలో పాట చిత్రీకరణకోసం యూరప్ వెళ్లిన తమ బృందం అద్భుతమైన రెండు గీతాలను షూటింగ్ చేసుకుని వచ్చిందని, ఈ పాటలలో చిరంజీవి డాన్సులు తిరిగి గత చిత్రాల వైభవాన్ని తీసుకువస్తాయన్న నమ్మకం వుందని, ఇక్కడికి వచ్చాక మిగతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి కానుకగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. తరుణ్ అరోరా, అలీ, వెనె్నల కిషోర్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ఆర్.రత్నవేలు, మాటలు: పరుచూరి బ్రదర్స్, కథ: మురుగదాస్, దర్శకత్వం: వి.వి.వినాయక్.