1న బేతాళుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకాలపై ఎస్.వేణుగోపాల్, కె.రోహిత్ అందిస్తున్న చిత్రం ‘బేతాళుడు’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పది నిమిషాల టీజర్‌కు విశేష స్పందన లభించిందని నిర్మాతలు చెబుతూ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా టీజర్‌కు వచ్చిన ఆదరణ చూసి తమకు నమ్మకం పెరిగిందని, ఆడియోకు కూడా విశేష ఆదరణ లభిస్తోందన్నారు. నటుడిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా వున్న తనకు బేతాళుడు చిత్రం కొనసాగింపుగా వుంటుందని నటుడు విజయ్ ఆంటోని తెలిపారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించానని, దర్శకుడు ప్రదీప్‌కుమార్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. బిచ్చగాడు తరువాత బేతాళుడుగా వస్తున్న తనకు చిత్రంపై భారీ అంచనాలు అధికంగానే వున్నాయని, అందుకు తగిన విధంగా ఈ చిత్రం రూపొందిందని ఆయన అన్నారు. అరుంధతి నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం:విజయ్ ఆంటోని, కెమెరా:ప్రదీప్ కలిపురయత్, ఎడిటింగ్:వీరసెంథిల్, నిర్మాతలు:కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్, సమర్పణ:ఎం.శివకుమార్, దర్శకత్వం:ప్రదీప్‌కుమార్.