మనసుకు దగ్గరైన కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా జర్నీ అంతా ఎమోషనల్‌గా సాగింది. ఈ కథ నా హృదయానికి దగ్గరైన కథ. ఇది హిట్ అయినందుకు ఆనందంగా వుంది’అని చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ తెలిపారు. నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శే్వత, అవికాగోర్ ప్రధాన తారాగణంగా మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మంచి టెక్నీషియన్స్ కుదరడంతో చక్కగా సినిమా వచ్చిందని, హెబ్బాపటేల్, నందిత శే్వత నటన హైలెట్‌గా నిలిచిందని తెలిపారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దుచేసిన సమయంలో నిర్మాతలు ధైర్యం చేసి ఈ సినిమాను విడుదల చేశారని, ఇంత విజయవంతం కావడంతో ఆ ధైర్యానికి ఫలితం దక్కినట్లుగా తాను భావిస్తున్నానని హీరో నిఖిల్ తెలిపారు. ఈ సినిమా విజయంలో భాగస్వామినైనందుకు గర్వంగా భావిస్తున్నానని కథానాయిక హెబా పటేల్ తెలిపారు. నిర్మాతలు, చోటా కె ప్రసాద్, వెనె్నల కిశోర్, రాజా రవీంద్ర తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు.