ఎన్టీఆర్‌తో మరో దర్శకుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఇంకా సరైన నిర్ణయం తీసుకున్నట్టు లేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ అంటూ పెద్ద లిస్టే తయారైంది. త్రివిక్రమ్ సినిమాకు ఇంకాస్త టైం పట్టేలా ఉంది. పూరి సిద్ధంగానే ఉన్నాడు కానీ, ఎన్టీఆరే ముందుకు రావడం లేదట. ఎన్టీఆర్ దర్శకుల లిస్టులోకి మరో కొత్త దర్శకుడు చేరాడు. ఆయన ఎవరో కాదు బాబీ. రవితేజతో పవర్ సినిమా చేసిన బాబీ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్‌కొట్టి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చేసి భారీ పరాజయాన్ని చవిచూశాక బాబీకి అవకాశాలు రావడం లేదు. అయితే ఎన్టీఆర్‌కు మంచి కథ చెప్పాడని తెలుస్తోంది. బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్‌కు బాగా నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను ఎన్టీఆర్ సెట్స్‌పైకి తీసుకొస్తాడో లేక ఇంకా వెయిట్ చేస్తాడో చూడాలి!