డేటింగ్‌లో సోనమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు, డేటింగ్‌లు సర్వసాధారణం. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ విషయంలో సంచలనం రేపుతున్నారు. నచ్చినోడితో డేటింగ్ చేస్తూ.. ‘అబ్బే మాకేం తెలియదు’ అంటూ బుకాయించడం మామూలే! తాజాగా మరో గ్లామర్ భామ సోనమ్ కపూర్ డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిందట! నిన్నటితరం హీరో అనిల్‌కపూర్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ విజయాలైతే దక్కడం లేదు. సినిమాలు చేస్తూనే ఖాళీ సమయంలో ప్రేమాయాణం సాగిస్తోంది. ఇప్పటికే బిజినెస్ టైకూన్ ఆనంద్ ఆహుజాతో కొన్ని రోజులుగా ఘాటు ప్రేమాయణం సాగిస్తోందట. ఈ విషయం బయటపడడంతో అలాంటిదేమీ లేదని బుకాయిస్తోందట. ఇన్నాళ్లకు సోమన్ గాడిలో పడిందని బాలీవుడ్‌లో ఒకటే గుసగుసలు..