అల్లు అర్జున్‌తో వక్కంతం వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ ఎప్పట్నుంచో దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుందంటూ ప్రచారం రావడమే తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి అన్నీ కుదిరి వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ హీరోగా వంశీ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిన ఈ సినిమాను లగడపాటి శ్రీ్ధర్, నాగబాబు నిర్మిస్తారు. అర్జున్‌కు సరిపడేలా వంశీ తయారుచేసిన కథ, క్యారెక్టరైజేషన్ హైలైట్స్‌గా నిలుస్తాయట. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేస్తున్న బన్నీ వచ్చే ఏడాది వక్కంతం వంశీ సినిమా మొదలుపెట్టనున్నట్టు
తెలుస్తోంది.