ఆరు పాటల నీలిమలై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్‌కృష్ణ, స్వరూప, బేబి హర్షిత ప్రధాన తారాగణంగా నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో ఆనంద్‌కృష్ణ రూపొందిస్తున్న చిత్రం నీలిమలై. దీనికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్‌కృష్ణ మాట్లాడుతూ, కేరళలోని వివిధ లొకేషన్లలో 70 శాతం షూటింగ్ పూర్తిచేశామని, మిగిలిన షూటింగ్ పార్ట్ ఇక్కడ జరుపుతున్నామని తెలిపారు. దీన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నీలిమలై కొండపై వెలసిన దేవదేవుని దివ్యలీలల సమాహారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఆరు పాటలతో రూపొందించిన ఈ చిత్రం అయ్యప్ప భక్తులకు నచ్చే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. సాయికిరణ్, అలీ, భానుచందర్, సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:ఆనంద్‌కృష్ణ, మాటలు:రామచంద్రారెడ్డి, కెమెరా:కిరణకుమార్ కొండా, సంగీతం:సదివె దేవేంద్ర, నిర్మాత:ఆనంద్ కృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సూర్యకిరణ్ ఇలాది.