సన్నాహాల్లో సామి సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కెరీర్‌లో అతి పెద్ద విజయంగా నమోదైన సినిమాల్లో 2003లో దర్శకుడు హరి రూపొందించిన ‘సామి’ ఒకటి. పోలీస్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విక్రమ్‌కు తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా మొదలవుతోంది. దర్శకుడు హరి ఈ సీక్వెల్‌ను సామి-2 పేరుతో తెరకెక్కించనున్నారు. ఎన్నాళ్లగానో ఈ ప్రాజెక్టును మొదలుపెడదామని విక్రమ్, హరిలు అనుకున్నప్పటికీ వాళ్లకున్న బిజీ షెడ్యూల్ వలన అది వర్కవుట్ కాలేదు. ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ పక్కా ప్లానింగ్‌తో మొదలవుతోంది. డిసెంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. అపరిచితుడు, ఐ, ఇరుముగన్ వంటి సినిమాలతో తెలుగులో సైతం విక్రమ్‌కు మంచి ఆదరణ ఉండటంతో ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. డైరెక్టర్ హరి ప్రస్తుతం సూర్యతో చేస్తున్న సింగం-3 పనుల్ని డిసెంబర్ ఆరంభం నాటికల్లా ముగించి, విక్రం సినిమాపై పూర్తి సమయాన్ని కేటాయిస్తారట.