రాజవౌళి అయితే ఓకె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ దర్శకుడు రాజవౌళికి కూడా ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న ఆయన హాట్ దర్శకుడిగా మారిపోయాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ అనే భాషాభేదం లేకుండా ఏ హీరో, హీరోయిన్ అయినా ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజవౌళి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. అనే దిశగా వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇలాంటి కోరికను బైటపెట్టింది బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ విద్యాబాలన్. ‘ది డర్టీపిక్చర్’ తరువాత తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుని సంచలన హీరోయిన్‌గా మారిన విద్యాబాలన్, ప్రస్తుతం కహాని-2 చిత్రంలో నటిస్తోంది. హైదరాబాద్ విచ్చేసిన ఆమె మాట్లాడుతూ- రాజవౌళి దర్శకత్వంలో నటించాలని ఉందనే కోరికను బైటపెట్టింది. మంచి స్క్రిప్ట్‌వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానంటూ చెప్పింది. విద్యాబాలన్ కోరికను మన జక్కన్న తీరుస్తాడో లేదో చూడాలి!