బేతాళుడు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా మానస్‌రిషి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ప్రదీప్‌కుమార్ దర్శకత్వంలో కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘బేతాళుడు’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పది నిమిషాల టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ నటుడిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా ఉన్న తనకు ఈ చిత్రం సరికొత్త గుర్తింపు ఇస్తుందని, సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించిన తాను గత చిత్రాల పాత్రలకు భిన్నమైన కథలో నటించానని, సరికొత్త ఫ్లేవర్ చిత్రంలో ఉంటుందని తెలిపారు.
ప్రదీప్ కలపురయల్ కెమెరా పనితనం చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని, సంగీతాన్ని తానే అందించానని అన్నారు. బిచ్చగాడు విజయం తర్వాత విడుదలవుతున్న బేతాళుడిపై భారీ అంచనాలు ఉన్నాయని, వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం రూపొందిందని వివరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 1న ప్రేక్షకుల ముందు కు వస్తున్నామని నిర్మాతలు తెలిపారు. అరుంధతీ నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: వీరసెంథిల్, దర్శకత్వం: ప్రదీప్‌కుమార్.