2న అండర్ వరల్డ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్ వరల్డ్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అండర్‌వరల్డ్ బ్లక్‌వార్స్ 3డి పేరుతో రూపొందుతున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది అన్నా పోర్‌స్టర్. హాలీవుడ్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి హీరోయిన్ అన్నాపోర్‌స్టర్ మాట్లాడుతూ, ఇంటిలిజెంట్‌గా ఉండే ఓ అమ్మాయి అండర్‌వరల్డ్‌పై ఎలా అటాక్ చేసింది అనే ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుందని, ఇందులో బ్రిలియంట్ యువతిగా కనిపిస్తానని చెప్పింది. కేట్ బెకిన్‌సెల్‌తో పనిచేయడం మరిచిపోలేని అనుభూతిగా ఉందని ఆమె చెబుతోంది. ఇప్పటికే అండర్ వరల్డ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా, ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. ఈ సినిమా కోసం చాలా విన్యాసాలు చేశానని, ఇక ప్రపంచ వ్యాప్తంగా తనకు మంచి పేరు వస్తుందని ఆమె పేర్కొంది. భారీ అంచనాలతో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది.