బాల నేతృత్వంలో కాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ దర్శకుడు బాల రూపొందించిన తాజా చిత్రం ‘చండీవీరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బి స్టూడియో పతాకంపై సమర్పిస్తున్నారు. శర్కునం దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ వేంకటేశ్వర మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఎం.ఎం.ఆర్. అనువదిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.ఆర్. మాట్లాడుతూ- ఫక్తు పల్లెటూరు చిత్రంగా రూపొందించిన ఈ చిత్రంలో రెండు ఊర్లమధ్య జరిగే పోరాటం వుంటుందని తెలిపారు. సంక్రాంతి సంబరాలనుంచి పల్లెటూరు సరసాలు, సరదాలవరకూ అన్నీ ఈ చిత్రంలో వుంటాయని, తొలి సగం కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. రెండోసగం ఉత్కంఠభరితంగా సాగుతుందని, సన్నివేశాలలో సంక్లిష్టతకు తగిన విధంగా ముత్తయ్య కెమెరా పనితనం మెప్పిస్తుందని అన్నారు. సామాజిక స్పృహతో సాగే ఈ చిత్రానికి అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయని, తెలుగువారికి కూడా కనెక్టయ్యే కథ, కథనాలు సినిమాలో వున్నాయని, డిసెంబర్‌లో పాటలను, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాజశ్రీ, బోస్ వెంకట్, ఎలాంపర్తి, రవిచంద్రన్, శాంతకుమారి, కె.అనంతన్, మధురై రమేష్, జి.కె. తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్తయ్య, సంగీతం:ఎస్.ఎస్.అరుణగిరి, మాటలు:ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఎడిటింగ్:ఎ.రాజామహమ్మద్, నిర్మాత:ఎం.ఎం.ఆర్., కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.శర్కునమ్.