కాజల్ బాటలో కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలు భాషల్లో సొంత అన్నదమ్ములైన హీరోలు, తండ్రీకొడుకుల సరసన కూడా కొందరు హీరోయిన్లు నటించిన సందర్భాలున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో కూడా పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ భామ చిరు తనయుడు రామ్‌చరణ్‌తో కూడా పలు చిత్రాలలో నటించడం విశేషం. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్‌కు తాజాగా కోలీవుడ్ అన్నదమ్ములైన సూర్య, కార్తి నటించే చిత్రాలలో అవకాశం లభించింది. సూర్య నటిస్తోన్న ‘తానా సెర్నద కూటం’ అనే చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లింది. కాగా ఆయన తమ్ముడు కార్తి ప్రస్తుతం మణిరత్నం చిత్రం ‘డ్యూయెట్’ చేస్తున్నాడు. దీనిలో నటిస్తూనే వినోద్ అనే మరో దర్శకునితో సినిమా చేయడానికి ఓకె చెప్పాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా కీర్తినే సంప్రదిస్తున్నారు. కాగా గతంలో ఈ ఇద్దరు అన్నదమ్ములతో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. సూర్యతో ఆమె ‘ఆయన్’ అనే సినిమాలో నటించింది. ఆ వెంటనే సూర్య తమ్ముడు కార్తితో ‘పైయా’ చిత్రంలో కలిసి నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇలా వారు చూపిన బాటలోనే కీర్తి సురేష్ కూడా నడుస్తోంది.