క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కుటుంబం నుండి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లనుండి మోక్షజ్ఞ నటించడానికి అనువైన ఓ జానపద కథకోసం అనే్వషించారు. కొంతమంది సీనియర్స్ కథకులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. చివరికి తన వందో చిత్రాన్ని రూపొందిస్తున్న క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేయడానికి బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మోక్షజ్ఞ ఓ అతిథి పాత్రలో కూడా నటించనున్నాడని ఆమధ్య వినిపించిన విషయం. అయితే ఈ సంగతిని అటు బాలకృష్ణగాని, ఇటు గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ సభ్యులు కానీ సమర్థించలేదు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో క్రిష్ ప్రతిభన గమనించిన బాలకృష్ణ, ఖచ్చితంగా అతడితోనే తనయుడి చిత్రాన్ని రూపొందించడానికి నిశ్చయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వున్న మోక్షజ్ఞ చిత్రాన్ని వచ్చే సంవత్సరంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.