శాతకర్ణి చివరి సన్నివేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి సన్నివేశాన్ని ఆర్‌ఎఫ్‌సిలో బాలకృష్ణ, శ్రీయ, హేమామాలినిపై చిత్రీకరించారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రారంభించామని, చిత్రీకరణలో భాగంగా మొరాకోలోని అట్లాస్ స్టూడియోలో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణతో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించామని తెలిపారు. దాదాపుగా వెయ్యిమంది జూ. ఆర్టిస్టులు 200 గుర్రాలతో ఈ షెడ్యూల్‌ను రోజుకు 16 గంటలపాటు ఏకధాటిగా చేశామని తెలిపారు. చిలుకూరి బాలాజీ ఆలయ సమీపంలో భారీ యుద్ధ నౌక సెట్ వేసి రెండో షెడ్యూల్‌ను చేశామని, జార్జియాలో మరో షెడ్యూల్ చేశామని తెలిపారు. వౌంట్‌కెజ్‌బెగ్‌లో ప్రారంభమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను భారీగా చిత్రీకరించామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నాలుగో షెడ్యూల్ రాజసూయాగ సన్నివేశాలతోసహా కీలకమైన చిత్రీకరణ చేశామని తెలిపారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ చేసిన చిన్న చిన్న ప్యాచ్‌వర్క్‌లను, ఓ పాటను చేశామని, సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని వారు తెలిపారు. జీవితకాలం గుర్తుండిపోయే సినిమాగా రూపొందించిన ఈ సినిమా జనవరి రెండో రెండో వారంలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ప్రేక్షకులముందుకు రానుందని వారు తెలిపారు. కబీర్‌బేడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జ్ఞానశేఖర్, సంగీతం:చిరంతన్‌భట్, పాటలు:సీతారామశాస్ర్తీ, మాటలు:సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్:రామ్‌లక్ష్మణ్, దర్శకత్వం:క్రిష్.