పిచ్చిగా నచ్చావోచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై వి.శశిభూషణ్ దర్శకత్వలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. సంజయ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రేమ అన్నది ప్రపంచ వ్యాప్తంగా వున్న విషయమేనని, కానీ ప్రేమలో వున్న ప్రతి మనిషి తనదైన శైలితో నిర్వచనం చెబుతుంటారని, ప్రేమ అన్నది వ్యక్తిగతంగా కూడా వుంటుందని ఆయన అన్నారు. చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మనసులు దూరం చేసుకుంటున్నారని, దీనివల్ల మనుషులు, మమతలు విడిపోతున్నాయని ఆయన అన్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న ఇటువంటి అయోమయ పరిస్థితిని ఓ యువకుడు తనకు ఎదురైన సమస్యల నేపథ్యంలో ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలచుకున్నాడు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాని విడుదల చేశారని, దానికి మంచి ఆదరణ లభించిందని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని ఆయన వివరించారు. చక్కని ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది ఉండదని, 46 రోజుల్లో షూటింగ్‌ను లావిష్‌గా పూర్తిచేశామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:వెంకట హనుమ, సంగీతం:రామ్‌నారాయణ, నిర్మాత:కమల్ కుమార్ పెండెం, దర్శకత్వం:వి.శశిభూషణ్.