తెలుగు క్వీన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన క్వీన్ సినిమా దక్షిణాదిలో రీమేక్ అవుతోంది. ఇందులో లీడ్ పాత్ర పోషించి జాతీయ ఆవార్డును అందుకుంది గ్లామర్ భామ కంగనా రనౌత్. ప్రముఖ తమిళ దర్శక నిర్మాత త్యాగరాజన్ రీమేక్ హక్కులు స్వంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఒక్కో భాషలో ఒక్కో హీరోయిన్‌తో ఈ సినిమా చేయిస్తున్నారట. ఇప్పటికే తమిళం కోసం తమన్నా, మలయాళం కోసం అమలాపాల్, కన్నడంలో రకుల్‌ప్రీత్ నటిస్తారని తెలిసింది. అయితే తెలుగులో ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్ కాలేదట. విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా సౌత్‌లో కూడా సంచలనం రేపుతుందని అంటున్నారు. అయితే, నాలుగు భాషలకు కలిపి బాగా పరిచయమున్న ఒకే హీరోయిన్‌తో చేస్తే బాగుండేదని అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కుగాను తమన్నానే ఓకె చేసేలా వున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌పై జెండా ఎగురవేసిన క్వీన్ తెలుగు బాక్సాఫీస్‌లో ఎలాంటి దండయాత్ర చేస్తుందో చూడాలి. అయితే, క్వీన్‌కు సంబంధించిన తెలుగు వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.