సన్నీ నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీలియోన్... జిస్మ్-2 సినిమా తరువాత ఇండియన్ సినిమా చరిత్రలో ఓ సంచలన తారగా నిలిచిపోయింది. అంతకుముందు పలువురు భామలు అందాలతో ప్రేక్షకులను రెచ్చగొట్టే ప్రయత్నాలెన్నో చేశారు. కానీ సన్నీ రాకతో వారందరికీ ఫుల్‌స్టాప్ పడింది. అసలే పోర్న్‌స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామను మించి అందాలు ఆరబోయడంలో అందరూ దిగదుడుపే. ఆ సినిమా తరువాత బాలీవుడ్‌ని సన్నీ ఫీవర్ పట్టేసింది. దాంతోపాటు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. ఇక ఈ భామ అందాలకు కుర్రకారు దాసోహం అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన పేరులో సన్నీ మొదటి రాంక్‌లో వుంది. గత ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పేరేదని చేసిన సర్వేలో సన్నీలియోన్ పేరే నెంబర్‌వన్. దాంతోపాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. మొత్తానికి గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సన్నీ తన హవాని మరోసారి నిలబెట్టుకుంది.