రీమేక్ ఈజీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమా హిట్టయ్యాక అదే సినిమా తీయాలంటే సులభమైన పని కాదు. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా గురించి ఎక్కువ అంచనాలు ఉంటాయి. ‘్ధృవ’ సినిమా రీమేక్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నేను చేసే చివరి రీమేక్ బహుశా ఇదే అయి వుండొచ్చు. ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తీసుకుని మన సొంత ఐడియాతో ఫ్రెష్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసాను. అలా చేయడానికి కొన్ని స్క్రిప్ట్‌లే పనికొస్తాయి. డిఫరెంట్ స్క్రిప్ట్ ఉన్న ఈ సినిమా ఇంటర్ రిలేటెడ్ సన్నివేశాలు ఉన్న సినిమాగా రూపొందింది’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రామ్‌చరణ్ కథానాయకుడుగా అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ధృవ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్ర విశేషాలను తెలిపారు.
బాగా ఆలోచించి..
ఈ సినిమాను మొదట చేయాలని అనుకోలేదు. అయితే ఓ వైవిధ్యమైన సినిమా చేయాలని చరణ్ భావిస్తున్న సమయంలో అతనితోనే ట్రావెల్ అయ్యాను. తను ‘తనిఒరువన్’ చిత్రాన్ని చూసి నన్ను చూడమని చెప్పాడు. నేను చూసి కొత్తగా ఉందని చెప్పాను. ఇలాంటి స్క్రిప్ట్ తనకు సూటవుతుందా అని చరణ్ అడిగి ననే్న డైరెక్ట్ చేయమన్నారు. రెండు రోజులు టైమ్ కావాలని చెప్పి ఆ తర్వాతే ఓకే అన్నాను.
మార్పులు ఇవీ
స్క్రిప్ట్‌లో ఏదైతే బాగున్న విషయాలను ఉంచి, కొంతవరకే మార్పులు చేశాం. మెయిన్ కథను మాత్రం ఎక్కడా మార్చలేదు. స్క్రిప్ట్‌లో అవసరమైనంతవరకు మాత్రమే కొత్తగా ఉండేలా రాసుకున్నాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు అనేకసార్లు ఆ సినిమాను చూశాను. ఇందులో నేనేం కొత్తగా చేయగలను? అని ఆలోచించాను. ఎందుకంటే రీమేక్‌లు గతంలో నేను చేయలేదు. తనిఒరువన్ కథను నా భాషలో చెప్పడానికి రెండు రోజులు ఆలోచించాను.
హీరో విలన్ల పాత్రలు
తమిళ సినిమాతో పోలిస్తే ఈ సినిమా అంచనాలు బాగా పెరిగాయి. అందులో చరణ్ కథానాయకుడు అవ్వడం మరింత రెట్టింపయ్యింది. ఆ అంచనాలకు తగ్గట్టే హీరో పాత్రలో మార్పులు చేశాను. అలాగే విలన్ పాత్రలో కూడా కొన్ని పెంచి చూపించామే తప్ప ఎక్కడా తగ్గించలేదు. విలన్ పాత్రలో మార్పులను మొదట అరవింద్‌స్వామికి వినిపించే చేశాం. ఆ మార్పులన్నీ ఆయనకి నచ్చాయి.
వర్క్ హాలిక్
చరణ్ ఈ చిత్రంకోసం ఎంత చేయాలో అంత చేశాడు. రీమేక్ గురించి అనుకోగానే తన బాడీ ఫిట్ గురించి ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. పాత్రకోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం ఎంత శ్రమించాడో నాకు తెలుసు. ఫ్యాషన్‌తో ఈ సినిమా పట్ల జాగ్రత్తలు తీసుకున్నాడు. నేను ఏది చెబితే అది చేశాడు.
హిప్ హాప్ తమిళ..
తమిళంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న సంగీత దర్శకుల పేరు ఇది. ఆది జీవ అనే ఇద్దరు వ్యక్తులు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే వీరిని తెలుగులోకి తీసుకోవడం సబబేనా అని కొంతమంది అడిగారు. కొత్తదనం ఎప్పుడూ స్వాగతించే తమ యూనిట్ వారిని ఈ సినిమాకు తీసుకున్నారు. రీరికార్డింగ్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది.
బాలీవుడ్ ఆఫర్స్
బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నమాట నిజమే. కానీ అక్కడ మనం ఎంతవరకు విజయం సాధిస్తాం అనేది ఆలోచించి చూడాలి. మినిమమ్ రెండు మూడేళ్లు అక్కడ వుంటేనే అది సాధ్యవౌతుందని భావిస్తా.
చిరంజీవితో సినిమా
చిరంజీవితో ఓ సినిమా కచ్చితంగా చేస్తా. కథ సిద్ధమైంది. అది వచ్చే సంవత్సరం ఉండొచ్చు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తాను అని ముగించారు.

- యు