అలరించే ఛోటా భీమ్ అడ్వెంచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానిమేషన్ చిత్రాల తయారీ రంగంలో మంచి ప్రఖ్యాతి సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ సంస్థ అందిస్తున్న నాలుగో చిత్రం ‘చోటా భీమ్’ హిమాలయాస్ అడ్వెంచర్ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 500 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత, గ్రీన్‌గోల్డ్ సంస్థ అధినేత రాజీవ్ చిలక మాట్లాడుతూ, నూతన సంవత్సర కానుకగా చోటా భీమ్, సోనాపూర్, బాలీ చిత్రాల తరువాత నాలుగో చిత్రంగా హిమాలయాస్ ఎడ్వెంచర్ చిత్రాన్ని రూపొందించామన్నారు. హిమాలయాల్లో సంచరించే అనుభూతి సినిమా చూసే ప్రేక్షకులకు కలుగుతుందని, పిల్లలతోపాటు పెద్దలని కూడా ఆకట్టుకునే విధంగా రూపొందించిన చిత్రమిదని అన్నారు. గ్రాఫిక్స్ టెక్నాలజీతో ట్రెడిషనల్‌గా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, భారతీయ యానిమేషన్ రంగంలో గ్రీన్‌గోల్డ్ సంస్థ ఎన్నో యానిమేటెడ్ కారెక్టర్లని రూపొందించిందని అన్నారు. దాంతోపాటు లైసెన్సింగ్, డిజిటల్ బిజినెస్ బ్రాండెడ్ స్టోర్స్, గేమింగ్ వంటి అప్లికేషన్లలో పేరుపొందిందని చెప్పారు. చోటా భీమ్ హిమాలయాస్ అడ్వెంచర్ చిత్రాన్ని ఆరు కోట్ల రూపాయలతో తెరకెక్కించామని, ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని, 18 నెలలపాటు 325 మంది ఆర్టిస్టులతో పనిచేసి ఈ 90 నిమిషాల చిత్రాన్ని రూపొందించామన్నారు. 2డి, 3డి యానిమనేషన్‌లలో ఈ చిత్రం రూపొందింది.