7 వేల థియేటర్లలో రోబో-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద నోట్ల ప్రభావం చాలా సినిమాలపై పడింది. కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేస్తున్నాయి. ఇక కొత్త ఏడాదిలో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక వచ్చే ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవే ఒకటి ‘బాహుబలి-2’, రెండు ‘రోబో-2’. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో రోబోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది. ఏకంగా నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదల కూడా అంతే భారీగా చేయనున్నారు. క్రేజీ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్లకు పైగా విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ కావడంతో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం వుంది. ఇక బాహుబలి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 5వేల థియేటర్లకు పైగా విడుదల చేశారు. మొత్తానికి హాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు శంకర్.