రవితేజకు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా విడుదలైన ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో మంచి జోరుమీదున్నాడు రవితేజ. ఈ సినిమా తరువాత ఆయన మూడు సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఎవడో ఒకడు’ షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు చక్రి దర్శకత్వంలో మరో చిత్రం కూడా సెట్స్‌పైకి రానుంది. దీంతోపాటు ‘స్వామిరారా’ ఫేం సుధీర్‌వర్మతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే కథా చర్చలు జరుపుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా గ్లామర్ బ్యూటీ అమీ జాక్సన్ నటిస్తోందని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నారని, అమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.