ఫిబ్రవరి 10న నమో వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ బిజినెస్ జరిగి ఓవర్‌సీస్ రైట్స్‌లో, శాటిలైట్ రైట్స్‌లోనేకాక అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్ జరిగిందని నిర్మాత తెలియజేశారు. రాబోయే సినిమాల్లో ఈ సినిమాపై అంచనాలు అధికంగా వున్నాయని, ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసి గ్రాఫిక్స్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. నాగార్జున హథీరామ్‌బాబాగా మరో అద్భుతమైన పాత్రలో నటించారని, సౌరబ్‌జైన్ వేంకటేశ్వరస్వామిగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటన సినిమాకు హైలెట్‌గా వుంటుందని ఆయన వివరించారు.