రవితేజ సరసన మెహరీన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బెంగాల్ టైగర్’ తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు రవితేజ. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపి ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో సైలెంట్ అయ్యాడు. ఇప్పటికే ఏడాదికిపైగా గడుస్తున్నా రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి అనే సందేహం ఇంకా ఆయన ఫ్యాన్స్‌లో నెలకొంది. ఫైనల్‌గా రవితేజ నెక్స్ట్ సినిమా ఓకే చేసాడు. పటాస్, సుప్రీం సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తికావచ్చిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నాని హీరోయిన్ నటిస్తోందట. నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ కౌర్ నటిస్తుందట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న మెహరీన్ ఇప్పటికే సాయిధరమ్, అల్లు శిరీష్‌లతో నటిస్తుంది. తాజాగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా క్లిక్ అయితే ఇక స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసినట్లే.