దమ్మున్న రక్షకభటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీచాపనయ్, బాహుబలి ప్రభాకర్, పృధ్వీ, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ‘రక్షకభటుడు’ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎం.ఎస్.రాజు, దిల్‌రాజు, దర్శకుడు వంశీకృష్ణ, గురురాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ- ఈ సినిమాతో తెలుగులోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న గురురాజ్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని, రక్ష, జక్కన్న సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ, కొత్త కానె్సప్టుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కథే హీరో అని, తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎం.ఎస్.రాజు, నిర్మాత గురురాజ్ దర్శకుడు వంశీకి అభినందనలు తెలిపారు. కారెక్టర్ ఆర్టిస్టులతో కథను నమ్ముకుని ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని, ఈనెలలోనే మరో షెడ్యూల్ ప్రారంభిస్తామని అన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ- సినిమా చిన్నదా, పెద్దదా అన్నది తాను నమ్మనని, జనాలకు నచ్చిన సినిమానే మంచి సినిమా అని, తాను తీసిన రెండు చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారన్నారు. సరికొత్త కానె్సప్టుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. ఆద్యంతం ఆహ్లాదంగా నవ్వించేలా సాగుతూ చివరి పది నిమిషాల్లో ఆలోచింపచేసే ఈ సినిమాను ఫిబ్రవరి నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:మల్హర్‌భట్ జోషి, ఆర్ట్:రాజీవ్ నాయర్, ఎడిటింగ్:అమర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:జె.శ్రీనివాసరాజు, నిర్మాత:ఎ.గురురాజ్, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ల.